లైంగిక వేధింపుల కేసు విచారణ..

దిశ, వెబ్‌డెస్క్ :

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ పరిధిలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఇంగ్లీష్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.సూర్య రాఘవేంద్ర లైంగిక ఆరోపణలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆ కేసును విచారించడానికి ఇన్వెస్టిగేషన్ కమిషనర్ రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ బి.శేషసాయి రెడ్డి బుధవారం యూనివర్సిటీకి వచ్చారు.

ఆయనకు వీసీ ఆచార్య మొక్క జగన్నాధరావు స్వాగతం పలికారు. యూనివర్సిటీ లీగల్ ఆఫీసర్ నందెపు నాగేంద్రరావుతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆచార్య సూర్య రాఘవేంద్రను మరియు విద్యార్థులను వేరువేరుగా విచారించారు.

Advertisement