ఐ‌స్‌క్రీమ్‌గా మారిపోయే ఆల్కహాల్స్

by Shyam |
Ice-Cream,-Beer
X

దిశ, ఫీచర్స్: చిన్నారులు ఇష్టంగా తినే ఐస్‌క్రీం.. ఇకపై మందుబాబులకు మహా ప్రాణంగా మారిపోవచ్చు. ఎన్నో ఫ్లేవర్స్‌లో లభించే హిమక్రిములు మరో కొత్త టేస్ట్‌తో నోరూరించనుంది. నోటికి తీపిని అందించే చల్లటిక్రీమ్‌లు ఇక మత్తెక్కించనున్నాయి. ఓ ప్రత్యేకమైన మెషిన్, ఆధునిక సాంకేతికతను ఉపయోగించి బీర్లు, కాక్‌టెయిల్స్, స్పిరిట్స్‌లను రుచికరమైన సాఫ్ట్ సర్వ్ ఐస్ క్రీమ్‌గా మార్చనున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా, సంతోషంగా ఉన్నా ఆ ఐస్‌క్రీం తిని బైక్ నడిపారో, డ్రంక్ అండ్ డ్రవ్‌లో దొరికే చాన్స్ కూడా ఉంటుంది.

ఇల్లినాయిస్‌, హింక్లీ‌లోని డబ్ల్యూడీఎస్ (WDS) డెజర్ట్ స్టేషన్ ఆవిష్కర్త, ఓనర్ విల్ రోజర్స్ ఇప్పటికే ఐస్‌క్రీముల్లో ఎన్నో కొత్త ఫ్లేవర్స్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. అధిక కెఫిన్ కలిగిన ఎస్ప్రెస్సో ఐస్ క్రీం రుచిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్న అతడు, ఇదే సూత్రాన్ని ఉపయోగించి ఆల్కహాల్ పానీయాలతోనూ కొత్త ఫ్లేవర్స్ రూపొందించాలనుకున్నాడు. సాధారణంగా ఐస్ క్రీం తయారు చేయడానికి వివిధ జెల్స్, స్టెబిలైజర్స్ ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలోనే వాటిపై ప్రయోగాలు ప్రారంభించగా ఎన్ఈఏ(NEA) జెల్‌ను సృష్టించి దానిపై పేటెంట్ పొందాడు. ఇది జీరో ఐస్‌క్రీం మెషీన్‌లో ఆల్కహాల్‌ను ఫ్రీజ్ చేస్తుంది.

‘ఇదివరకు ఆల్కహాల్‌ గడ్డకట్టే స్థానం గురించి ఎవరూ ఆలోచించలేదు. ఎందుకంటే ఆ ఫ్రీజింగ్ పాయింట్‌లో దాన్ని తినలేరు. కానీ మేం దాన్ని రియాలిటీకి తీసుకొచ్చాం. ప్రారంభ రోజుల్లో ఫ్రీజింగ్ కోసం లిక్విడ్ నైట్రోజన్ ఉపయోగించాం. కానీ ఇప్పుడు కొత్త యంత్రాల్లో ఆల్కహాల్ ఐస్‌క్రీమ్‌గా మారి తినడానికి సిద్ధంగా ఉంటుంది. కోన్ పెడితే చాలు ఆటోమేటిక్‌గా క్రీమ్ వచ్చేస్తుంది. ఇది ఆల్కహాల్ కంటెంట్‌ను అస్సలు ప్రభావితం చేయదు. ఏబీవీ(ABV-ఆల్కహాల్ బై వ్యాల్యూమ్) సరిగ్గా అదే విధంగా ఉంటుంది. అంటే మీరు ద్రవ రూపంలో అదే సమ్మేళనాలలో ఐస్‌క్రీమ్‌‌గానూ పొందొచ్చు. ద్రవరూపంలోని బీర్ ఐస్‌క్రీమ్ రూపంలోకి మారడానికి 30 నిమిషాలు పడుతుంది.

కానీ, అధిక ఆల్కహాల్ కంటెంట్ పానీయాలు మరింత ఎక్కువ సమయం తీసుకుంటాయి. మా మెషిన్‌ను ఎఫ్‌డీఏ ఆమోదించింది. ఈ ‘బిలో జోరో ఐస్ క్రీం’ మెషిన్‌ను బార్స్, బ్రూవరీస్‌కు అమ్మాలని భావిస్తున్నాను. వోడ్కా విత్ లైమ్ కోన్ నా ఫేవరేట్ కాగా సమ్మర్ టైమ్‌లో ఇటాలియన్ ఐస్ క్రీం తింటుంటాను. సాంకేతికంగా చెప్పాలంటే.. ఐస్ క్రీం కాదు, ఇది సాఫ్ట్ సర్వ్ ఆల్కహాల్‌గా చెప్పొచ్చు. ప్రపంచంలో బిలో జీరో మెషిన్ మొట్టమొదటి ఆల్కహాలిక్ ఐస్ క్రీం మెషిన్ ఏం కాదు. మూడు ఏళ్ల క్రితం, మేము బజ్ పాప్ కాక్టెయిల్స్, తాజా పండ్లు ప్రీమియం మద్యాలతో తయారుచేసిన ఆల్కహాల్-ప్రేరేపిత పాప్సికల్స్ విక్రయించాం’ – విల్ రోజర్స్, బిలో జోరో మెషిన్ సృష్టికర్త

Advertisement

Next Story