హైఫ్లో ఆక్సిజన్ థెరపి పరికరం ఆవిష్కరణ

by  |
హైఫ్లో ఆక్సిజన్ థెరపి పరికరం ఆవిష్కరణ
X

దిశ, న్యూస్‌బ్యూరో: కొవిడ్-19 రోగుల కోసం హై ప్లో ఆక్సిజన్ థెరపి పరికరాన్ని కాన్పూర్ ఎస్‌ఐఐసీ ఇంక్యుబేటరీ సంస్థ నోకా రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆవిష్కరించింది. కరోనా కారణంగా దేశంలో అధిక ప్రవాహ ఆక్సిజన్ చికిత్స పరికరాల యొక్క అవసరాన్ని నోకార్క్ హెచ్ 210 పరిష్కరిస్తుంది. హెచ్‌ఎఫ్‌ఓటి (హై-ఫ్లో ఆక్సిజన్ థెరపీ పరికరం) రోగులకు తేమతో కూడిన ఆక్సిజన్ అధికంగా ఉండే గాలిని అందిస్తుంది. తద్వారా రక్తానికి సరఫరా చేయబడిన ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. హై-ఫ్లో ఆక్సిజన్ థెరపీ సులభంగా నోటి ద్వారా పీల్చడం, వదలడం సాధ్యమవుతుంది. వేడిచేసిన, తేమతో కూడిన వాయువు ఎపిథీలియల్ మ్యూకో-సిలియరీని కూడా పెంచుతుంది, దాంతో న్యుమోనియా వంటి శ్వాసకోశ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

సర్వో హ్యూమిడిఫైయర్‌తో నోకార్క్ హెచ్ 210 నియంత్రిత సెట్ ఉష్ణోగ్రత, తేమ స్థాయితో గాలిని అందిస్తుంది. హెచ్‌ఎఫ్‌ఎన్‌సీ మెషిన్ అభివృద్ధిపై నోకా రోబోటిక్స్ సీఈవో నిఖిల్ కురెలే మాట్లాడుతూ.. “హై-ఫ్లో ఆక్సిజన్ థెరపీ ఆక్సిజనేషన్ మెరుగుపరచడం, టోమోఫోబిక్ ఫీలింగ్ తగ్గించడం వంటి ప్రయోజనాలతో సమృద్ధిగా వస్తుందన్నారు. వ్యక్తికి స్వేఛ్చగా ఊపిరి పీల్చుకోవడానికి సహాయపడుతుందన్నారు. శ్వాసక్రియ యొక్క జీవక్రియ వ్యయాన్ని తగ్గించడానికి నిర్మించిన నోకార్క్ హెచ్ 210 తీవ్రమైన దీర్ఘకాలిక శ్వాస సమస్య ఉన్న రోగులకు గరిష్ట సౌకర్యాన్ని అందిస్తుంది. ప్రస్తుతం హెచ్‌ఎఫ్‌ఎన్‌సీ పరికరాల కోసం మార్కెట్లో డిమాండ్ పెరుగుతోందని, ప్రతిరోజు కొవిడ్-19 సంఖ్య పెరుగుతుందన్నారు.


Next Story

Most Viewed