- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
షారుఖ్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసిన ఆలియా

దిశ, సినిమా : టాలెంటెడ్ ఆలియా భట్ ప్రొడ్యూసర్‌గా తన మొదటి చిత్రాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించిన ఆలియా.. నిర్మాత కన్నా ముందు ఒక యాక్టర్‌నని, అదే తనకు ఇష్టమని చెప్పింది. అయితే ఈ సమయంలో మాత్రం నటిగా చాలా నెర్వస్‌గా ఫీల్ అవుతున్నట్లు తెలిపింది. ఇదేంటో తెలియదు కానీ న్యూ ఫిల్మ్ స్టార్ట్ చేసే ముందురోజు రాత్రి శరీరమంతా జలదరింపు శక్తిని పొందుతానని, రాత్రంతా దాని గురించి ఆలోచిస్తానని వివరించింది. ఈ ట్వీట్‌పై స్పందించిన షారుఖ్ ఖాన్ ఆలియాకు ఓ రిక్వెస్ట్ పెట్టాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక ఆలియా ప్రొడ్యూసర్‌గా వ్యవహరించే సెకండ్ మూవీలో తనకు అవకాశం ఇవ్వాలని కోరాడు. షూటింగ్‌కు సమయానికి వస్తానని, ప్రొఫెషనల్‌గా ఉంటానని ప్రామిస్ చేశాడు. ఇక షారుఖ్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసిన ఆలియా.. దీనికి మించి ఇంకేమీ అడగలేను డీల్ ఓకే అని చెప్పింది.
https://twitter.com/aliaa08/status/1411347232775753735?s=20