- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రియేటివిటీ పెరగాలంటే.. ఇలా చేస్తే సరి!
దిశ, ఫీచర్స్ : నిద్రలోకి జారుకునే అసాధారణ మానసిక స్థితిలోనే మనుషుల ఆవిష్కరణ శక్తి పెరుగుతుందని గతంలో యూఎస్ ఇన్వెంటర్ థామస్ ఎడిసన్ వంటి వ్యక్తులు తెలిపారు. ఈ ఆలోచనను తాజా అధ్యయనం కూడా బలపరిచింది. నిద్ర ప్రారంభ దశల్లో ఉన్న వ్యక్తులను మేల్కొలిపినపుడు కష్టతరమైన గణిత సమస్యలను సైతం పరిష్కరించగలిగే సామర్థ్యాన్ని పొందుతారని కనుగొంది.
ప్రజలు నిద్రలోకి జారుకున్నప్పుడు హిప్నాగోజియా లేదా ‘N1’ అనే స్థితిలో కొన్ని నిమిషాలు గడుపుతారు. ఈ స్థితిని స్పష్టమైన కలల ద్వారా వర్ణించవచ్చు. అయితే గాఢ నిద్ర నుంచి మేల్కొన్న తరువాత ఆ కలలను మరచిపోతారు. ఇక ఎడిసన్ విషయానికొస్తే తను క్లిష్ట సమస్యలు ఎదుర్కొన్నప్పుడు.. గాఢ నిద్రలోకి జారుకునే ముందు తనను తాను మేల్కొనేలా చేసుకోవడం ద్వారా ఈ స్థితిని అనుభవించాడు.
చేతిలో ఒక స్టీల్ బాల్ పట్టుకుని ఆయన ఈ ఎక్స్‌పరిమెంట్ చేయగా.. స్పృహ కోల్పోయినపుడు బంతి కిందపడేది. ఆ శబ్దానికి లేచిన తర్వాత ఎడిసన్ మరింత యాక్టివ్‌గా పనిచేసేవాడు. ఎడిసన్‌తో పాటు స్పానిష్ కళాకారుడు సాల్వడార్ డాలీ తదితరులు సైతం సగం నిద్రలో మేల్కొన్న స్థితి నుంచి పుట్టుకొచ్చిన సృజనాత్మక అంతర్ దృష్టిని ఉపయోగించుకున్నారు.
ప్రపంచాన్ని కదిలించిన 5నెలల పసిగుడ్డు మరణం
పారిస్‌లోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ రీసెర్చ్’లో పనిచేసిన డెల్ఫిన్ ఓడియెట్.. చాలా కాలంగా హిప్నాగో జియా కొన్ని సొంత అనుభవాలను గడించారు. వీటి ఆధారంగా సృజనాత్మకతకు స్లీప్ ఇంటరప్షన్‌కు గల సంబంధాన్ని నిష్పాక్షికంగా పరీక్షించింది. ఈ క్రమంలో 103 మంది వ్యక్తులకు మ్యాథ్స్ టాస్క్‌ను అప్పజెప్పిన ఓడియెట్ బృందం.. ఒక చీకటి గదిలో ఏర్పాటు చేసిన వాలు కుర్చీలో కళ్ళు మూసుకుని పడుకోవాలని సూచించింది.
ఎడిసన్ టెక్నిక్ మాదిరిగానే వారి చేతికి ఒక బాటిల్ ఇచ్చి నిద్రపొమ్మన్నారు. అలా నిద్రలోకి జారుకున్న తర్వాత బాటిల్ కిందపడింది. ఆ శబ్దంతో వారు మేల్కొన్నారు. ఈ పద్ధతిలో 24 మంది కనీసం ఒక 30-సెకన్ల N1 ఎపిసోడ్ నిద్రను అనుభవించగా.. మరో 14 మంది N1 ద్వారా గాఢ నిద్రలోకి వెళ్లారు. ఇక మిగిలిన వారు అస్సలు నిద్రపోలేదు.
స్లీప్ ఎపిసోడ్ తర్వాత చేపట్టిన మ్యాథ్స్ టాస్క్‌లో.. ఎన్1 దశకు చేరుకున్న వారి నుంచి 83 శాతం మంది మాత్రమే హిడెన్ షార్ట్‌కట్ రూపొందించారు. మెలకువగా ఉన్న లేదా N2 దశకు చేరుకున్న వారి సక్సెస్ రేట్లు వరుసగా 31 శాతం, 14 శాతంగా ఉన్నాయి. ఈ మేరకు నిద్రలోని N1 స్టేజ్(మెలకువకు, అపస్మారక స్థితికి మధ్యలోని సగం దశ) సృజనాత్మకతను వెలికితీస్తుందని ఓడియెట్ అభిప్రాయపడ్డారు. ఇక ‘హిప్నాగో జియా’ అనేది నిజంగా ప్రజలు అన్వేషించని కొత్త రకమైన స్పృహ అని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఆడమ్ హార్ హోరోవిట్జ్ తెలిపారు. ఈయన N1 దశకు చేరుకున్న వ్యక్తులను మేలుకొల్పేందుకు చేతికి ధరించే ‘డోర్మియో’ అనే పరికరాన్ని అభివృద్ధి చేశారు.