పర్యాటకంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు..!

by Shyam |
పర్యాటకంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు..!
X

దిశ, పటాన్‌చెరు: గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్ ఆధ్వర్యంలో అక్టోబర్ 20, 31 తేదీల్లో ‘ప్రపంచ గమ్యస్థానాల రూపకల్పన పోకడలు, వ్యూహాత్మక చర్యలు’ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి.

పర్యాటకం అనేది ప్రపంచ అతిపెద్ద ఆర్థిక రంగాల్లో ఒకటని, కానీ కొవిడ్ మహమ్మారి ప్రపంచ పర్యాటక ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం ఏర్పడడానికి దారితీసిందని పేర్కొన్నారు. పర్యాటక, ప్రయాణ, ఆతిథ్య రంగాల్లోని కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు కొత్త ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలతో ఈ రంగాన్ని పునర్నిర్మించడంపై విభిన్న అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ సదస్సు ఒక వేదికగా తోడ్పడనుందన్నారు. ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 15 వ తేదీలోగా అమూర్త పత్రాలను సమర్పించవచ్చని, ఈ సదస్సులో పాల్గొనదలచిన వారి పేర్లను సెప్టెంబర్ 21వ తేదీ నుంచి నమోదు చేసుకుంటారని తెలిపారు. ఇతర వివరాల కోసం 9848192864 ను సంప్రదించాలని లేదా www.ghbstourism.gitam.edu ను సందర్శించాలన్నారు.

Next Story

Most Viewed