ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి : అదనపు కలెక్టర్ వేణుగోపాల్

by Shyam |   ( Updated:2021-10-18 06:38:29.0  )
ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
X

దిశ,వనపర్తి : 2021-22 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో అక్టోబర్ 25వ తేది నుండి నవంబర్ 2 వ తేది వరకు జరుగు ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ పై పరీక్షల నిర్వహణ కమిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా పరిధిలో 27 పరీక్షా కేంద్రాలలో 7 వేల 34 మంది విద్యార్థులు పరీక్షలు రాసేవిధంగా ఏర్పాట్లు పూర్తి చేయాలనీ, అధికారులను ఆదేశించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ఉదయం 8.30 నిమిషాల లోగా చేరుకోవాలని, ఆ తరువాత అనుమతించబోమని హెచ్చరించారు. పోస్ట్ ఆఫీస్, ఆర్.టీ.సి, పోలీసు బందోబస్తు, రెవెన్యూ శాఖ, వైద్య, ఆరోగ్య శాఖ, విద్యాశాఖ అధికారులు సమన్వయం తో ఎలాంటి పొరపాట్లు లేకుండా పరీక్షలు నిర్వహించాలన్నారు.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ, తప్పనిసరిగా మాస్కు ధరించి, శానిటైజర్ చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనుమతి ఉండదని ఆయన తెలిపారు. వాటర్ బాటిల్ వెంట తీసుకు వెళ్లాలని ఆయన వివరించారు. పరీక్ష సమయంలో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించిన విద్యార్థులు పరీక్ష వ్రాయుటకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Advertisement

Next Story