- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆన్‌లైన్ ద్వారా ఇంటర్మీడియట్ అడ్మిషన్లు
దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్మీడియట్ అడ్మిషన్లను ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తున్నట్టుగా ఇంటర్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ప్రకటించారు. లాక్‌డౌన్, కరోనా వ్యాధివ్యాప్తి నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా అడ్మిషన్లు చేపట్టాలని నిర్ణయించినట్టుగా తెలిపారు. విద్యార్థులు నేరుగా కళాశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆన్‌లైన్‌లోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు పొందవచ్చిన తెలిపారు. ఎస్‌ఎస్‌సీ హాల్ టికెట్ ఆధారంగా అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. జూన్ 1 నుంచి www.tsbie.cgg.gov.in వెబ్‌సైట్ లో అడ్మిషన్లను స్వీకరించబడుతయని ప్రకటించారు.
కాగా జులై 5 వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని ఇదివరకే తెలియజేశారు. ప్రస్తుతం ఆన్‌లైన్ అడ్మిషన్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మాత్రమే అనుమతించారు.ఇది వరకు ప్రకటించిన ఆన్ లైన్ తరగతులను వాయిదా వేస్తున్నట్టుగా ఇంటర్ బోర్డ్ తెలిపింది. ప్రతి ఏడాది జూన్ 1న ఇంటర్మిడియట్ తరగతులు ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది కోవిడ్ దృష్ట్యా ముందుగా ప్రకటించిన సమయానికి నిర్వహించలేకపోతున్నామని తెలిపారు. ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.