రంగు మారుతున్న చేతులు.. మెడికల్ మిరాకిల్

by  |
రంగు మారుతున్న చేతులు.. మెడికల్ మిరాకిల్
X

దిశ, వెబ్‌డెస్క్:

శ్రేయ సిద్ధనగౌడర్‌కి 2016 సెప్టెంబర్‌లో ఒక ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో అయిన గాయాల వల్ల ఆమె చేతులు తొలగించాల్సి వచ్చింది. తర్వాత ఆమెకు కొచ్చిలోని అమృత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఆపరేషన్ చేసి కొత్త చేతులు పెట్టారు. అయితే ఆ చేతులు ఒక ఇరవై ఏళ్ల యువకుడివి. అంతేకాకుండా అతని చేతులు పూర్తిగా నలుపు రంగు చర్మంతో ఉన్నాయి. శ్రేయ చర్మం రంగు మాత్రం వాటికి భిన్నం. ఆసియాలో జరిగిన మొదటి ఇంటర్ జెండర్ హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇది. దాదాపు 13 గంటల పాటు కష్టపడి 20 సర్జన్లు, 16 స్ట్రాంగ్ అనస్థీషియాలు ఇచ్చి చేతులను శ్రేయ ఎముకలు, నరాలను అంటించారు. తర్వాత 18 నెలల పాటు శ్రేయకు ఫిజియోథెరపీ చేశాక చేతుల్లో స్పందన మొదలైంది.

అయితే ఈ మధ్య ఒక అద్భుతం జరిగింది. ఆపరేషన్ సమయంలో పూర్తిగా నలుపు రంగులో ఉన్న చేతులు ఇప్పుడు రంగు మారి ఆమె శరీర రంగులో కలిసి పోయాయి. ఇదెలా జరుగుతోందో ఆమెకు తెలియలేదు కానీ సంతోషంగా ఉన్నట్లు శ్రేయ తెలిపింది. కేవలం రంగు విషయంలోనే కాకుండా చేతులు కూడా పూర్తిగా ఆడవాళ్ల చేతుల్లాగ మారుతున్నాయి. మణికట్టు, చేతి వేళ్లు సన్నగా మారడం, గోర్లు వేగంగా పెరగడాన్ని గమనించినట్లు శ్రేయ వాళ్ల అమ్మ తెలిపింది.

ఈ విషయం గురించి డాక్టర్లకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. శ్రేయ చేతులు రంగు మారడాన్ని మాత్రం అధ్యయనం కోసం రికార్డు చేస్తున్నట్లు ఆమెకు సర్జరీ చేసిన డాక్టర్లలో ఒకరైన డాక్టర్ సుబ్రహ్మణ్య అయ్యర్ చెప్పారు.

tags: Inter gender hand, Transplantation, Kerala, Kochi, Shreya, Color change


Next Story

Most Viewed