ఈ నెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు.. విద్యార్థులు సిద్ధమేనా..?

by Shyam |
intermediate students
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నట్లు బోర్డు కార్యదర్శి ఉమర్​జలీల్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే 1,768 పరీక్ష కేంద్రాల్లో సుమారు 4.59 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు చెప్పారు. 82 శాతం మంది హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని శనివారం బోర్డు కార్యాలయంలో మీడియాకు వివరించారు. అయితే కరోనా నిబంధనలు పాటిస్తూ.. తప్పనిసరిగా హాల్‌‌లో మాస్కును ధరించాలన్నారు. ఈ నెల 25 నుంచి నవంబరు 3 వరకు నిర్వహించనున్న పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మరోవైపు హుజూరాబాద్​ఉప ఎన్నిక కారణంగా ఈ నెల 30న జరగాల్సిన పరీక్షను మరుసటి రోజు 31కి వాయిదా వేశామన్నారు. ఆదివారమైనప్పటికీ.. పరీక్ష ఉంటుందని స్పష్టం చేశారు. ఇది ఇలా ఉంటే పరీక్షలకు విద్యార్థులు ఎంత మేరకు సిద్ధమయ్యారనేది ఫలితాల వరకు వేచిచూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed