ఇంటర్ అడ్మిషన్లు ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తాం: ఇంటర్ బోర్డు

by srinivas |
Inter-Board-Ap
X

దిశ, ఏపీ బ్యూరో : ఇంటర్ అడ్మిషన్లు ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇప్పటి వరకు అడ్మిషన్లకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని స్పష్టం చేసింది. కొన్ని కళాశాలలు ఆఫ్‌లైన్‌లో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. ఆఫ్‌లైన్‌ అడ్మిషన్లను ఇంటర్ బోర్డు పరిగణలోకి తీసుకోబోదని క్లారిటీ ఇచ్చింది.

ఆఫ్‌లైన్‌ అడ్మిషన్లు చేపట్టే ప్రైవేట్ కళాశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారానే అడ్మిషన్లు పొందాలని ఇంటర్ బోర్డు విద్యార్థులకు సూచించింది.

Advertisement

Next Story

Most Viewed