మర్డర్ చేసి తాపీగా సిగరెట్ కాల్చిన డైరెక్టర్

by Jakkula Samataha |
మర్డర్ చేసి తాపీగా సిగరెట్ కాల్చిన డైరెక్టర్
X

దిశ, సినిమా: కోలీవుడ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ ‘సాని కాయిధమ్’ సినిమా ద్వారా యాక్టర్‌గా మారుతున్న విషయం తెలిసిందే. అరుణ్ మాథేశ్వరన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్‌తో కలిసి లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ఇండస్ట్రీ అటెన్షన్ క్యాచ్ చేయగా మూవీ కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు(శుక్రవారం) సెల్వ రాఘవన్ పుట్టినరోజును పురస్కరించుకుని మరో పోస్టర్ రిలీజ్ చేసింది ‘సాని కాయిధమ్’ మూవీ యూనిట్.

ఓ వ్యక్తిని మర్డర్ చేసి ఒంటినిండా బ్లడ్‌తో తాపీగా మందు తాగి, సిగరెట్ ఆస్వాదిస్తున్న కోల్డ్ బ్లడెడ్ రుత్‌లెస్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తున్న సెల్వ రాఘవన్ పోస్టర్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ‘నెంజం మరప్పతిల్లై’తో డార్క్ రిలేషన్ షిప్ డ్రామాస్‌కు ట్రేడ్ మార్క్‌గా మారిన సెల్వ రాఘవన్ ‘సాని కాయిధమ్’ సినిమాతో అదే జోనర్‌లో యాక్టర్‌గా తనదైన మార్క్ చూపించబోతున్నారు. ఈ సందర్భంగా సెల్వ రాఘవన్‌కు బర్త్ డే విషెస్ తెలుపుతూ పోస్ట్ పెట్టింది కీర్తి సురేశ్. ఇదే పోస్టర్‌ను షేర్ చేసిన కీర్తి.. ‘పార్ట్‌నర్ ఇన్ క్రైమ్‌’కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ విష్ చేసింది. తనను అమేజింగ్ డైరెక్టర్‌గా చూడటం గర్వంగా ఉందన్న కీర్తి..సెల్వ లాంటి బ్రిలియంట్ యాక్టర్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని తెలిపింది.

https://twitter.com/KeerthyOfficial/status/1367696857397227521?s=20

Advertisement

Next Story