ఇకపై ఆన్‌లైన్‌లోనూ బీమాపాలసీ ఫిర్యాదులు

by Harish |
ఇకపై ఆన్‌లైన్‌లోనూ బీమాపాలసీ ఫిర్యాదులు
X

దిశ, వెబ్‌డెస్క్: బీమా సేవల్లో లోపాలకు సంబంధించి ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించేందుకు గాను బీమా అంబుడ్స్‌మెంట్ నిబంధనలు-2017లో సవరణలను ఆర్థిక శాఖ బుధవారం వెల్లడించింది. బీమా పాలసీదారుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఈ నిబంధనల్లో మార్పులు చేసినట్టు ఆర్థిక శాఖ తెలిపింది. బీమా బ్రోకర్లను వీటి పరిధిలోకి తీసుకొచ్చినట్టు, ఇకపై పాలసీదారులు ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది. తాజా నిబంధనలతో అంబుడ్స్‌మెంట్ ఫిర్యాదులను పరిష్కరించే పరిధి పెరుగుతుంది. ఇదివరకు బీమా కంపెనీలు, బ్రోకర్లు, ఏజెంట్లతో పాటు ఇతరుల సేవల లోపాలకు సంబంధించి వివాదాలకు మాత్రమే పరిష్కారం లభించేంది. కాగా, దేశవ్యాప్తంగా 17 వరకు అంబుడ్స్‌మెన్ కార్యాలయాలు ఉన్నాయి. ఏ ప్రాంతంలో ఫిర్యాదు నమోదైనప్పటికీ అధికారిక కార్యాలయాల్లో ఉన్న అంబుడ్స్‌మెంట్ పరిష్కారం చేస్తారు.

Advertisement

Next Story