ఇన్‌స్టాలో నెగెటివ్ కామెంట్స్‌కు చెక్

by Harish |
ఇన్‌స్టాలో నెగెటివ్ కామెంట్స్‌కు చెక్
X

లాక్‌డౌన్ పీరియడ్‌లో సామాజిక దూరం బాధ్యతను తెలియ‌జెప్పేందుకు ‘కో వాచింగ్’ ఫీచర్‌‌ను అందుబాటులోకి తెచ్చిన ఇన్‌స్టాగ్రామ్ తాజాగా మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. మన మనసుకు నచ్చిన, లేదా మన భావనలను, అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటాం. సెలబ్రెటీలు కూడా అందుకు మినహాయింపేం కాదు. వాళ్లు కూడా తమ వ్యక్తిగత, వృత్తిగత సమాచారాన్ని పోస్టు చేస్తుంటారు. కానీ, ఆ పోస్టులకు కొందరు నెగెటివ్ కామెంట్స్ పెట్టడం.. అవి కాసేపట్లోనే వైరల్ కావడం లేదా కాంట్రవర్సీకి దారి తీయడం మనం చూస్తూనే ఉంటాం. ఇన్‌స్టా అకౌంట్ హోల్డర్లకు కూడా ఇలాంటివి అనుభవాలు ఉండే ఉంటాయి. అయితే నెగటివ్ కామెంట్స్‌కు చెక్ చెప్పడానికి ఇన్‌స్టా సరికొత్త ఫీచర్‌ను తీసుకు రాబోతుంది. ఇన్‌స్టా కావచ్చు.. మరేదైనా సోషల్ మీడియా వేదిక కావచ్చు. ఎక్కడైనా నెగెటివ్ కామెంట్స్ సదరు అకౌంట్ హోల్డర్లను బాధపెడతాయి. ఇకపై ఇన్‌స్టాలో అలాంటి నెగెటివ్ కామెంట్స్‌ను ఇన్‌స్టా యూజర్లు డిలీట్ చేయొచ్చు. ఒకటో రెండో కాదు.. ఒకేసారి బల్క్‌గా కూడా డిలీట్ చేయొచ్చు. అంతేకాదు మన పోస్ట్‌కు కామెంట్లు పెట్టకుండా కూడా రిస్ట్రిక్ట్ చేయొచ్చు. అండ్రాయడ్, ఐఓఎస్ రెండింటిలోనూ ఈ ఫీచర్‌ను‌ ఎనేబుల్ చేసుకోవచ్చు. పాజిటివ్ కామెంట్‌ను హైలెట్ చేసుకునే సదుపాయం కూడా ఇన్‌స్టా కల్పిస్తుంది. పోస్ట్‌కు మిమ్మల్ని ట్యాగ్ చేయకుండా కూడా అడ్డుకోవచ్చు.

డిలీట్ చేయడం ఇలా :

– కామెంట్‌పై ట్యాప్ చేస్తే చాలు.. డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు ఏ కామెంట్స్‌ను డిలీట్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. ఒకేసారి 25 కామెంట్ల వరకు డిలీట్ చేయొచ్చు.
– రైట్ కార్నర్‌లో ఉన్న 3 డాటెడ్ ఐకాన్‌పై ట్యాప్ చేయండి
– టర్న్ ఆఫ్ కామెంట్స్/ చూజ్ వర్డ్స్ టూ హైడ్ అని కనిపిస్తుంది.
– సెలెక్ట్ మేనేజ్ కామెంట్స్ / కామెంట్ కంట్రోల్స్‌లోకి వెళ్తారు.
– అక్కడ అలో కామెంట్స్ ఫ్రమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
– అకౌంట్ బ్లాక్ చేయడానికి లేదా రిస్ట్రిక్ట్ చేయడానికి కూడా ఆప్షన్లు కనిపిస్తాయి.

Advertisement

Next Story

Most Viewed