- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇన్‌స్టా న్యూ ఫీచర్.. కంటెంట్ రీస్టోర్‌కు చాన్స్
దిశ, ఫీచర్స్: ఇన్‌స్టాగ్రామ్ యాప్.. వినియోగదారుల సౌకర్యార్థం కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఈ లేటెస్ట్ అప్‌డేట్‌తో డిలీట్ చేసిన ఫొటోలు, వీడియోలు, రీల్స్, ఫైల్స్ అన్నింటినీ రీస్టోర్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. యూజర్స్ తమ కంటెంట్ రీస్టోర్ గురించి ఎప్పట్నుంచో అడుగుతున్నారని, ప్రస్తుతం తీసుకొచ్చిన ఫీచర్‌తో యూజర్స్ తమ కంటెంట్‌ను రీస్టోర్ చేసుకోవచ్చని ఇన్‌స్టా తన బ్లాగ్‌లో పేర్కొంది. యూజర్లు తాము ఇన్‌స్టా యాప్ నుంచి డిలీట్ చేసిన వీడియో, ఫొటోలు ‘రీసెంట్‌లీ డిలీటెడ్ (Recently Deleted)’ అనే ఫోల్డర్‌లోకి మూవ్ అవుతాయి. ఈ ఫోల్డర్ నుంచి యూజర్లు తమ అకౌంట్స్ ద్వారా కంటెంట్‌ను రీస్టోర్ చేసుకోవచ్చు. కాగా, తొలగించబడిన ఇన్‌స్టా స్టోరీస్ ఈ ఫోల్డర్‌లో 24 గంటల పాటు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇతర కంటెంట్ 30 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. లేటెస్ట్ వెర్షన్ ఇన్‌స్టా యాప్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉందని ఇన్‌స్టా తెలిపింది.