యూజర్లకు డైట్ సలహాలు.. క్షమాపణలు చెప్పిన ఇన్‌స్టా..!

by Sujitha Rachapalli |
యూజర్లకు డైట్ సలహాలు.. క్షమాపణలు చెప్పిన ఇన్‌స్టా..!
X

దిశ, ఫీచర్స్ : ఇన్‌స్టాలో హ్యష్ ‌ట్యాగ్, యూజర్ నేమ్స్ కాకుండా వినియోగదారుల అభిరుచులు, ఆలోచనల ఆధారంగా ఎక్కువ ఆసక్తి ఉన్న కంటెంట్‌ను మరింత సులభంగా కనుగొనేందుకు, సెర్చింగ్‌లో సాయపడేందుకు ఇన్‌స్టా న్యూ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ మేరకు సెర్చ్ బార్‌లో టైప్ చేసిన విషయానికి సంబంధించిన అంశాలను ఈ ఫీచర్ సూచించనుంది. అయితే ఇన్‌స్టా ఎక్కువగా ‘బరువు తగ్గడం, ఉపవాసం, ఆకలిని తగ్గించే పదార్థాలు’ తదితర డైటరీ పదాలను సిఫార్సు చేస్తుండటం పట్ల యూజర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇన్‌స్టా తన యూజర్లకు క్షమాపణలు చెప్పింది.

ఇన్‌స్టా వినియోగిస్తున్న సమయంలో కొందరికి ‘కెలోరీ కౌంటింగ్ ఇమేజెస్, డైట్ మెథడ్స్, ఈటింగ్ డిజార్డర్ రికవరీ’ వంటి అంశాలను సజెస్ట్ చేయడంతో.. చాలామంది వాటి వల్ల ప్రేరణ పొంది కొంతమంది అనారోగ్యం పాలవుతుండగా.. బరువు తగ్గించుకోవాలనే కోరిక లేకున్నప్పటికీ ఇన్‌స్టా చూపిస్తున్న ఇమేజ్‌ల వల్ల తమలో ఆత్మన్యూనతా భావం పెరుగుతోందని మరికొందరు వెల్లడించారు. 10,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్న ఈటింగ్ డిజార్డర్ ప్రచారకుడు హోప్ వర్గో కూడా ఈ విషయంలో ఇన్‌‌స్టాను తప్పుపట్టాడు. దాంతో ఇన్‌స్టా ‘ఈటింగ్ డిజార్డర్స్’‌ను ప్రోత్సహించే కంటెంట్‌ను బ్యాన్ చేసింది. అంతేకాదు 18 ఏళ్ల లోపున్న వారికి బరువు తగ్గించే ప్రొడక్ట్స్‌ను రిస్ట్రిక్ట్ చేసింది.

‘ఇన్‌స్టా అందిస్తున్న సమాచారం వల్ల యూజర్లు ప్రేరణ పొందుతున్నారు. ఈటింగ్ డిజార్డర్స్ వల్ల మానసిక అనారోగ్యం దెబ్బతినొచ్చు. డైట్ ప్లాన్స్‌ను సరైన మోతాదులో, నిపుణుల ఆధ్వర్యంలోనే అమలు చేయాలి. కాగా బరువు తగ్గడానికి సంబంధించిన ఏదైనా కంటెంట్‌ను నిలిపివేయడానికి వినియోగదారులకు ఆప్షనల్ ఫంక్షన్ సాయపడుతుంది’ అని ఎన్‌హెచ్‌ఎస్ డాక్టర్ వోల్రిచ్ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed