ఖమ్మం ప్రజలకు శుభవార్త

by Sridhar Babu |
Nodel-Officer
X

దిశ, అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల ఏర్పాటుకు భవనాలను ఇంటర్మీడియట్ నోడల్ అధికారి బి. సులోచనారాణి పరిశీలించారు. మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన భవనాలను ఆమె పరిశీలించారు. ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భవనాలను పరిశీలించడానికి వచ్చినట్లు ఆడట తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి కళాశాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆమె వెంట ఎంపీటీసీ కృష్ణారెడ్డి , ఎస్ఎంసీ చైర్మన్ జమలయ్య, ఇనుపనూరి రాంబాబు, వెంకన్న తదితరులు ఉన్నారు.


Next Story

Most Viewed