నెల్లూరులో కేసీఆర్ పేరిట శిలాఫలకం 

by Anukaran |   ( Updated:2020-08-30 05:14:25.0  )
నెల్లూరులో కేసీఆర్ పేరిట శిలాఫలకం 
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా నాయుడు పేట మండలం స్వర్ణముఖి దివ్యక్షేత్రంలో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తెలంగాణ సీఎం కేసీఆర్, సతీమణి శోభ దంపతులు విరాళం అందించారు. ఆలయ ముందు భాగంలో మహారాజ గోపురం, తూర్పు మాడవీధి నిర్మాణానికి వారు విరాళాలు ఇచ్చారు.

కాగా శనివారం ఈ ఆలయంలో శ్రీవారి విగ్రహ ప్రతిష్ఠ, కుంబాభిషేకం, ఇతర పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కేసీఆర్ దంపతులు పాల్గొనాల్సి ఉంది. అయితే కరోనా నిబంధనల దృష్ట్యా వారు హాజరు కాలేదు. ఈ క్రమంలో ఆలయ నిర్వాహకులు కేసీఆర్ పేరిట శిలాఫలకం ఆవిష్కరించారు.

Advertisement

Next Story