పంజాగుట్టలో మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్

by Sumithra |   ( Updated:2021-01-04 11:33:58.0  )
పంజాగుట్టలో మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాగుట్ట సర్కిల్‌లో మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్ చేశాడు. ట్రాఫిక్ పోలీస్ బూత్‌పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో గమనించిన పోలీసులు.. కిందకు దించారు. ఇదేక్రమంలో అక్కడున్న స్థానికులు భయానికి గురయ్యారు. ఆర్సీపురానికి చెందిన రాజు కొన్నాళ్ల క్రితం అనారోగ్యానికి గురై మతిస్థిమితం కోల్పోయాడు. సోమవారం అతని కుటుంబ సభ్యులు నిమ్స్ ఆస్పత్రికి తీసుకురాగా వారి నుంచి తప్పించుకొని వచ్చి పంజాగుట్ట సర్కిల్ వద్ద ట్రాఫిక్ బూత్‌పైకి ఎక్కాడు. అయితే అదే సమయానికి ఆర్టీసీ బస్సు రాగా పైకి ఎక్కిన పోలీసులు అతడిని కిందకు దించారు. స్వల్పగాయాలైన రాజును చికిత్స నిమిత్తం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story