- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కనగర్తిలో ఖాళీ బిందెలతో మహిళల వినూత్న నిరసన..
by Shyam |

X
దిశ, వేములవాడ : గత 45 రోజులుగా తాగడానికి నీళ్ళు రావడంలేదని మహిళలు ఖాళీ బిందెలతో గ్రామపంచాయతీ ఎదుట ఆందోళనకు దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తి గ్రామంలో ఖాళీ బిందెలతో మహిళలు గ్రామపంచాయతీ ఎదుట ఆందోళన చెపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 45 రోజులుగా 4వ వార్డులో తాగడానికి నీళ్లు లేవని పలుమార్లు సర్పంచ్, వార్డు మెంబర్లకు విన్నవించుకున్నా పట్టించుకోవడంలేదని, అందుకే ఖాళీ బిందెలతో గ్రామపంచాయతీ ఎదుట ఆందోళన చేపట్టామన్నారు. ఈ క్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ.. మూడు, నాలుగు రోజులలో నీటి సరఫరా సక్రమంగా వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు.
Next Story