నల్లగొండ వ్యాపారుల వినూత్న నిర్ణయం

by  |
నల్లగొండ వ్యాపారుల వినూత్న నిర్ణయం
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కానీ, రోజురోజుకూ నల్గొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నల్గొండ వర్తక సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో జనరల్‌ దుకాణాలను ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నం2 గంటల వరకు మాత్రమే తెరవాలని నిర్ణయించారు. అత్యంత రద్దీగా ఉండే కిరాణా దుకాణాలు, స్టేషనరీ, మొబైల్ రీచార్జ్ సెంటర్లు తప్పకుండా మూసి ఉంచాలని నిర్ణయించారు. నెహ్రూ గంజ్‌లో ని హోల్ సేల్ దుకాణాలు కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈ నిబంధనలను ఉల్లఘించినవారికి రూ.2 వేలను ఫైన్ విధించనున్నారు. ఇక ప్రకాశం బజార్‌లోని కూరగాయల మార్కెట్ సముదాయంలోని దుకాణాలను సాయంత్రం 5 గంటల వరకే తెరిచి ఉంచుతారని ప్రకటించారు. అత్యంత రద్దీగా ఉండే మార్కెట్‌లో కరోనా వ్యాప్తి జరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ‘నల్గొండ జనరల్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌’ వెల్లడించింది.


Next Story

Most Viewed