గీతంలో వినూత్న కోర్సులు.. ప్రారంభమైన అడ్మిషన్ల ప్రక్రియ

by Shyam |
gitam university
X

దిశ, పటాన్ చెరు: పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో 2021-22 విద్యా సంవత్సరం నుంచి మూడు వినూత్న కోర్సులకు శ్రీకారం చుడుతున్నట్టు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ వెల్లడించారు. ఐటీ సర్వీసెస్ లో భారతీయ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సహకారంతో బీఎస్సీ కంప్యూటర్ సైన్సెస్ (కాగ్నిటివ్ సిస్టమ్స్), బీకాం (బిజినెస్ ప్రాసెస్ మేనేజ్ మెంట్) కోర్సులతో పాటు ప్రముఖ నేత్ర వైద్యశాల ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ సౌజన్యంతో బీ.ఆప్లిమెట్రీ (బ్యాచిలర్ ఆఫ్ ఆప్లోమెట్రీ) కోర్సులను ప్రారంభిస్తున్నట్టు గురువారం పేర్కొన్నారు.

ఈ మేరకు ఆయా సంస్థలతో విడివిడిగా అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నట్టు ఆయన తెలిపారు. ఐటీ, ఐటీ అనుబంధ, ఐటీఐఎస్ సంస్థలలో పనిచేయడానికి బీఎస్సీ, బీకాం కోర్సులు ఉపకరిస్తాయని, అప్లోమెట్రీ ద్వారా నేత్ర రుగ్మతలను నిర్ధారించుకుని దృష్టిని మెరుగుపర్చేలా లెన్సులు, కళ్ళజోడు అమర్చడం వంటివి చేయొచ్చని ప్రొఫెసర్ శివప్రసాద్ వివరించారు. పుష్కలకంగా ఉపాధి అవకాశాలు ఉన్న ఈ కోర్సులలో చేరాలని అభిలాషించే విద్యార్థులు 98924 73876 / 8542424254 లను సంప్రదించాలని, లేదా www.gitam.edu ను సందర్శించాలని ఆయన సూచించారు.

Advertisement

Next Story