తొలి టెస్టుకు గిల్ దూరం?

by Shyam |
తొలి టెస్టుకు గిల్ దూరం?
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియాకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. తొలి టెస్టులో గాయపడిన ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇంగ్లాండ్‌తో జరగాల్సిన తొలి టెస్టులో ఆడేది అనుమానంగా మారింది. న్యూజీలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా గాయపడిన గిల్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అయితే అతను తొలి టెస్టు నాటికి కోలుకునే అవకాశం లేనట్లు తెలుస్తున్నది. అతడి స్థానంలో మయాంక్ అగర్వాల్ లేదా కేఎల్ రాహుల్‌ను తీసుకునే అవకాశం తెలుస్తున్నది. మరోవైపు గిల్ కూడా గత కొన్ని మ్యాచ్‌లుగా ఫామ్ లేమితో బాధపడుతున్నాడు. అదే సమయంలో గిల్ కూడా గాయపడటంతో టీమ్ మేనేజ్‌మెంట్ అతడిని తప్పించి మరొకరిని తీసుకోవడానికి రంగం సిద్దం చేసింది. ఇక ప్రస్తుతం టీమ్ ఇండియా క్రికెటర్లు ఇంగ్లాండ్‌లో కుటుంబాలతో సెలవులు ఎంజాయ్ చేస్తున్నారు. మూడు వారాల తర్వాత తిరిగి అందరూ లండన్ చేరుకుంటారని బీసీసీఐ తెలిపింది.

Advertisement

Next Story