- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి ఈటల భూ కబ్జాలపై ప్రారంభమైన విచారణ
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భూ అక్రమాల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట్ అలాగే, హకీంపేట్ గ్రామాలకు చెందిన కొందరు బలహీన వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఒక లేఖ రాయగా, సీఎం వెంటనే స్పందించి దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా మాసాయిపేట మండల ఎమ్వారో శనివారం ఉదయం రెవెన్యూ, విజిలెన్స్ అధికారులతో కలిసి విచారణ ప్రారంభించారు. దీంతో అచ్చంపేటకు ఈటల రాజేందర్ అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఈ భూ కబ్జా విషయంలో బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి, సీఎం కేసీఆర్ నివేదిక సమర్పించనున్నారు.
Advertisement
Next Story