- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇన్ఫోసిస్ లాభం రూ.5,076 కోట్లు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ 2020-21 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో 17.5 శాతం వృద్ధితో రూ.5,076 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. అయితే డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 2.3 శాతం క్షీణించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 13.1 శాతం పెరిగి రూ. 26,311 కోట్లకు చేరుకుందని, త్రైమాసిక ప్రాతిపదికన 1.5 శాతం పెరిగిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో కూడా భారీగా లాభాలను సాధించిన ఇన్ఫోసిస్ రూ.9,200 కోట్ల విలువ షేర్ల బైబ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ మేరకు బుధవారం కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపినట్టు పేర్కొంది. షేర్ల బైబ్యాక్ కోసం ఒక్కో షేర్‌కు గరిష్ఠంగా రూ. 1,750గా నిర్ణయించినట్టు వివరించింది. ఇక 2020-21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్ఫోసిస్ నికర లాభం 16.6 శాతం పెరిగి రూ.19,351 కోట్లకు చేరుకుందని, ఆదాయం 10.7 శాతం వృద్ధితో రూ. 1,00,472 కోట్లుగా ఉన్నట్టు వెల్లడించింది.