వాగులు దాటే ప్రయత్నాలు ఎవరూ చేయొద్దు

by Sridhar Babu |
వాగులు దాటే ప్రయత్నాలు ఎవరూ చేయొద్దు
X

దిశ‌, కొత్త‌గూడెం: భారీ వర్షాల కారణంగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున వాగులు దాటే ప్రయత్నాలు చేయవద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి ప్రజలకు సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వరద ఉధృతిని ఎప్పటికప్పుడూ తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ఈదురు గాలులతో నిరంతరం భారీగా వర్షం పడుతోందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ప్రాజెక్టుల్లోకి వస్తున్న వరదను బట్టి నీటిని వదులుతున్నామని లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పశువులను కూడా మేతకు బయటికి పంపకుండా ఇంటి పట్టునే ఉంచాలని చెప్పారు. అంటూ వ్యాధులు సోకే కాలం కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వలు లేకుండా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. చెట్లు కొమ్మలు విరిగి పడే అవకాశం ఉన్నందున తక్షణం అటువంటి చెట్లు గుర్తించి కొమ్మలు తొలగించాలని చెప్పారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. నీటి కాలుష్యం కారణంగా వ్యాధులు సోకే ప్రమాదం ఉందని సంబంధిత అధికారులు సురక్షిత నీరు సరఫరా చేయాలని చెప్పారు. మంచినీటి ట్యాంకులను ప్రతి 10 రోజులకు ఒకసారి పరిశుభ్రం చేయాలని చెప్పారు. పరిస్థితులను బట్టి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తామని, సమగ్ర నివేదికలతో సిద్ధంగా ఉండాలని చెప్పారు.

Advertisement

Next Story