హృదయ విదారక ఘటన.. రోడ్డుమీద బెంచీపై 20 రోజుల పసికందు

by Shyam |   ( Updated:2021-09-22 05:07:04.0  )
baby girl
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో తెలియదు. కానీ తన మాతృ హృదయాన్ని చంపుకుని తన ఇరవై రోజుల పసికందును రోడ్డు పక్కనే ఉన్న బెంచీపై పడుకోబెట్టి వెళ్ళిపోయిన హృదయ విదారక ఘటన బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర కాకతీయ స్కూల్ సమీపంలో వెలుగుచూసింది. గుర్తుతెలియని వ్యక్తులు దాదాపు 20 రోజుల ఆడ శిశువును బెంచీపై వదిలి వెళ్లారు. సమీపంలో ఉన్న వెంగమాంబ హోటల్ నిర్వాహకుడు గమనించి దేవరకద్ర ఎస్ఐ భగవంతు రెడ్డికి తెలియజేశారు. ఆయన ఘటనా స్థలానికి చేరుకొని శిశువు ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి, ఐసీడీఎస్ సిబ్బందికి అప్పగించారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న ఆ పసికందును ఎవరు వదిలి వెళ్లిపోయారనేది తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భగవంతు తెలిపారు.

baby girl

Next Story

Most Viewed