- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీటెక్ స్టూడెంట్స్‌కు పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ తప్పనిసరి
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రభుత్వ భరోసాతో నగర శివార్లలోని పారిశ్రామికవాడల్లో అనేక పరిశ్రమలు ప్రారంభమై ఉత్పత్తిని ముమ్మరం చేశాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్ అన్నారు. కొవిడ్ నేపథ్యంలో పరిశ్రమల తీరుతెన్నులను పరిశీలనకు మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జీ మర్రి రాజశేఖర్‌రెడ్డితో కలిసి ఆయన సోమవారం జీడిమెట్ల, బాలానగర్‌లో ప్రాంతాల్లో పర్యటించారు. ప్రతిష్టాత్మక ఆజాద్ ఇండస్ట్రీని సందర్శించారు. రోల్స్ రాయీస్, సీమెన్స్, జీఈ, హానీవాల్, బీహెచ్ఈఎల్ సంస్థలకు, విమానాలు, రాకెట్ల విడి భాగాలను, విద్యుత్ టర్బైన్స్ భారీ యంత్రాలకు అవసరమైన పరికరాలను ప్రతిష్టాత్మక ఆజాద్ ఇండస్ట్రీ అందిస్తోంది. ఈ సందర్భంగా ఆజాద్ ఇండస్ట్రీ కార్యకలాపాలను సంస్థ సీఎండీ రాకేష్ చోప్దార్ వివరించారు. మెకానికల్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ తప్పనిసరి అనే నిబంధన అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వినోద్ కుమార్ తెలిపారు.