టీఎస్ ఐపాస్‌తో రూ.1.96 లక్షల కోట్ల పెట్టుబడులు

by Shyam |
టీఎస్ ఐపాస్‌తో రూ.1.96 లక్షల కోట్ల పెట్టుబడులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణకు టీఎస్ ఐపాస్ విధానం అద్భుతమైన ఫలితాలను అందించిందని, ఈఓడీబీ ర్యాంకుల్లో ఫస్ట్‌ప్లేస్‌లో నిలిపేందుకు అవకాశం కల్పించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటివరకు రూ.1,96,404 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అనుమతులు పొందిన 12,021 పరిశ్రమల్లో 75శాతానికి పైగా తమ కార్యకలాపాలను ప్రారంభించాయన్నారు. రానున్న రోజుల్లో రూ.45,848 కోట్ల పెట్టుబడులు మెగా ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టుల రూపంలో వస్తాయన్నారు. తద్వారా సుమారు 83వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌తో కలిసి మంగళవారం ప్రగతిభవన్‌లో వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నెట్ ఆఫీస్ అబ్ సార్ ప్షన్ విషయంలో హైదరాబాద్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. హైదరాబాద్ నగరం జీవించడానికి అత్యంత అనుకూలమైన నగరంగా ప్రథమ ర్యాంకు సాధించినన్నారు. బెస్ట్ ఫర్ఫామింగ్ స్టేట్‌గా నీతి అయోగ్ ద్వారా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్లో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.

ప్రస్తుతం కరోనా సంక్షోభంలో తెలంగాణలోని పరిశ్రమలు పెద్దఎత్తున ప్రభుత్వానికి అండగా నిలిచాయన్నారు. సుమారు కరోనా రిలీఫ్ ఫండ్ కోసం రూ.150 కోట్లకు పైగా నిధులు లేదా ఇతరత్రా కాంట్రిబ్యూషన్ రూపంలో వచ్చాయన్నారు. జాతీయ జీఎస్డీపీ సగటుతో పోల్చుకుంటే తెలంగాణ 8.2 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిందన్నారు. జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా గత ఏడాది నమోదైన 4.55 శాతంతో పోలిస్తే 2019- 20 సంవత్సరానికి 4.76 శాతంగా నమోదయిందన్నారు. తలసరి ఆదాయం విషయంలోనూ జాతీయ సగటు రూ.1,34,432 లతో పోల్చినప్పుడు, తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,28,216 లుగా నమోదైందని మంత్రి అన్నారు. దేశ ఎగుమతుల్లోనూ తెలంగాణ వాటా 10.6 1 శాతం నుంచి 11.58 శాతానికి పెరిగిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed