దేవకట్టా ‘ఇంద్ర ప్రస్థం’ మోషన్ పోస్టర్

by Anukaran |
దేవకట్టా ‘ఇంద్ర ప్రస్థం’ మోషన్ పోస్టర్
X

దర్శకుడు దేవ కట్టా జాగ్రత్త పడ్డాడు. తన కంటెంట్ మరొకరు కొట్టేస్తారని, కొట్టేశారని ఆరోపించిన దేవ కట్టా ఇప్పటికే తన ఐడియా‌తో సినిమా చేసి డిజాస్టర్ చేశారని.. ఇప్పుడు మాత్రం అలా కానివ్వను అని నిర్మాత విష్ణుతో ఆన్ లైన్‌లో వార్ కి దిగాడు. ఇది జరిగిన రెండ్రోజుల్లోనే తను అనుకున్న కంటెంట్‌తో మూవీ తీస్తున్నట్లు టీజర్ రిలీజ్ చేశాడు. ప్రస్థానం‌తో స్టామినా ఉన్న డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న దేవ కట్టా..తన లేటెస్ట్ మూవీ ఇంద్ర ప్రస్థం టైటిల్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాడు.

ఉమ్మడి ఏపీ రాజకీయాల నుంచి స్ఫూర్తి పొందిన దేవ కట్టా ఇంద్ర ప్రస్థం సినిమా చేస్తుండగా తన వాయిస్ ఓవర్‌తో మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాడు. ‘‘ప్రపంచంలో జరిగే పోటీలు అన్నింటికీ పర్పస్ ఒక్కటే విన్నర్స్‌ను ఎంచుకోవడం. విన్నర్ రన్ ది వరల్డ్. ఆ పోటీలో అనుకోకుండా ఇద్దరు స్నేహితులు ఎదురైతే ఆ ఆటకున్న కిక్కే వేరు’’ అంటూ మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, వై‌ఎస్‌ఆర్ స్నేహం, రాజకీయ వైరాన్ని తెరకెక్కిస్తున్నారు దేవ కట్టా. ప్రూదోస్ ప్రొడక్షన్స్‌పై తెరకెక్కుతున్న సినిమాను హర్ష వి, తేజ నిర్మిస్తున్నారు.

Advertisement

Next Story