‘జంతువుల‌ ఆరోగ్యం జాగ్రత్త’

by Aamani |
‘జంతువుల‌ ఆరోగ్యం జాగ్రత్త’
X

దిశ, ఆదిలాబాద్: తెలంగాణలో ఉన్న పెద్దపులులు, ఇత‌ర వ‌న్య‌ప్రాణుల‌ సంరక్షణకు త‌గిన జాగ్ర‌త్తలు తీసుకోవాల‌నీ, వాటి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అట‌వీశాఖ అధికారుల‌ను ఆదేశించారు. అమెరికాలోని బ్రాంక్స్ ‘జూ’లో పులికి కరోనా వైరస్ సోకిన నేప‌థ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేర‌కు ఆయన పీసీసీఎఫ్ ఆర్.శోభ‌తో ఫోన్‌లో మాట్లాడారు. జూ పార్క్‌లు, కవ్వాల్‌, అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లలో ఉన్న జంతువులు అనారోగ్యం బారిన ప‌డ‌కుండా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. వాటికి సురక్షితమైన ఆహారాన్ని అందించాల‌న్నారు. ఆహారం అందించే కీపర్లకు కరోనా పరీక్షలు చేయాలని ఆదేశించారు. జంతువులకు కరోనా సోకకుండా వైద్య, వెటర్నరీ, ఇతర శాఖ అధికారుల సమన్వయంతో పనిచేయాల‌ని సూచించారు. సీసీటీవీల ద్వారా పులుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్న‌ట్లు పీసీసీఎఫ్ మంత్రికి వివ‌రించారు. వేసవిలో జంతువులు నీటి సమస్యలు ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవాలనీ, అగ్ని ప్రమాదాలకు ఆస్కారం జాగ్రత్త పడాలని సూచించారు.

Tags: corona to tiger, animal, indrakaran reddy, pccf, kavval forest range, zoo park,

Advertisement

Next Story