కొత్తగా గ్రీన్ ఫంగస్.. మొదటి కేసు ఎక్కడంటే..?

by Anukaran |   ( Updated:2021-06-17 01:32:43.0  )
Green Fungus first case in India
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి నుండి ఇప్పుడిప్పుడే అన్ని దేశాలు కోలుకొంటున్నాయి. కానీ, ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవకుండానే కొత్త ఫంగస్ లు ప్రజలపై దాడి చేస్తున్నాయి. ఇప్పటీకే బ్లాక్ , వైట్, ఎల్లో ఫంగస్ కేసులను గుర్తించిన వైద్యులు తాజాగా గ్రీన్ ఫంగస్ ను కూడా గుర్తించారు. మధ్యప్రదేశ్ లో ఓ వ్యక్తికి గ్రీన్ ఫంగస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఇండోర్‌లోని శ్రీ అరబింద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రిలో ఈ ఫంగస్ ఇన్‌ఫెక్షన్‌ను ఛాతీ వ్యాధుల విభాగాధిపతి డాక్టర్ రవి దోసి గుర్తించారు. ఇటీవలే కోవిడ్ నుంచి కోలుకున్న ఓ వ్యక్తికి గ్రీన్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ సోకిందని ఆయన వివరించారు.

ఇటీవల 35 ఏళ్ల ఓ వ్యక్తి కరోనా నుండి కోలుకున్నాడు. ఆ తర్వాత కూడా అతనికి ముక్కు నుండి రక్తం కారడం, రోజు జ్వరం రావడంతో బ్లాక్ ఫంగస్ సోకిందేమోనని డాక్టర్లు అనుకున్నారు. పరీక్షలు చేయగా ఊపిరితిత్తుల్లో గ్రీన్ ఫంగస్ ఉన్నట్లు తేలిందని వైద్యులు తెలిపారు. దీంతో ఆయన ఊపిరితిత్తులు, రక్తం, సైనస్ ల మీద ప్రభావం పడినట్లు తెలిపారు. గ్రీన్ ఫంగస్.. ఒకరమైన ఆస్పెర్‌గిలోసిస్ ఇన్‌ఫెక్షన్ అని, కరోనా లాగే ఇది కూడా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందని , మనుషుల్లో చాలా అరుదుగా ఇలాంటి ఇన్‌ఫెక్షన్ వస్తుందని డాక్టర్లు తెలిపారు. కాగా, బాధితుడిని చికిత్స నిమిత్తం ఎయిర్ అంబులెన్సు ద్వారా ముంబైకి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed