బ్రేకింగ్.. కేజ్రీవాల్ పార్టీలో చేరిన ఇందిరాశోభన్.. కామెంట్స్ ఇవే..

by Shyam |
బ్రేకింగ్.. కేజ్రీవాల్ పార్టీలో చేరిన ఇందిరాశోభన్.. కామెంట్స్ ఇవే..
X

దిశ, తెలంగాణ బ్యూరో : నాన్ కరప్టెడ్, ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టం వంటి విధివిధానాలు నచ్చే తాను ఆమ్ ఆద్మీ పార్టీలోకి చేరినట్లు సీనియర్ నాయకురాలు ఇందిరాశోభన్ తెలిపారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో మాళవీయ నగర్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి ఆధ్వర్యంలో ఇందిర ఆమ్ ఆద్మీ పార్టీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా ‘దిశ’తో ఇందిరా శోభన్ మాట్లాడుతూ.. డబ్బుంటేనే రాజకీయం చేయొచ్చు అని అందరూ భావిస్తారని, కానీ అలాంటివేమీ అక్కర్లేదని ఆమ్ ఆద్మీ పార్టీ నిరూపించుకుందన్నారు. ఈ విషయంలో అందరికీ ఆదర్శంగా నిలిచిందని ఆమె కొనియాడారు. ఢిల్లీలో విద్యార్థులకు అందించే ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టం విషయంలో అన్ని రాష్ట్రాలకు ‘ఆప్’ రోల్ మోడల్‌గా నిలిచిందని, ఈ విధానాన్ని తెలంగాణలో సైతం అమలు చేసేలా పార్టీ తరఫున పోరాడుతానన్నారు. తెలంగాణకు ఆయుధంగా ఆమ్ ఆద్మీ ఉండబోతోందని ఆమె వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed