స్మార్ట్‌ఫోన్ రవాణాలో భారత్ రికార్డు

by Harish |
స్మార్ట్‌ఫోన్ రవాణాలో భారత్ రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: సెప్టెంబర్ త్రైమాసికంలో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రవాణా 17 శాతం పెరిగి 5.4 కోట్ల యూనిట్ల ఎగుమతులు నమోదయ్యాయని పరిశోధనా సంస్థ ఐడీసీ శుక్రవారం వెల్లడించింది. అయితే, ఈ ఏడాది తొలిసగంలో కరోనా మహమ్మారి వంటి విపత్తు కారణంగా భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కొన్నేళ్ల తర్వాత వార్షిక తగ్గుదలను నమోదు చేయనున్నట్టు ఐడీసీ తన నివేదికలో తెలిపింది.

ప్రస్తుత ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో చైనా, అమెరికా లాంటి దేశాలు వార్షిక ప్రాతిపదికన క్షీణతను నమోదు చేస్తున్నప్పటికీ, భారత్ సానుకూల వృద్ధిని కొనసాగించడం విశేషం. అదికూడా రికార్డు స్థాయిలో 5.4 కోట్ల ఉత్పత్తులను రవాణా చేయడం ద్వారా 17 శాతం వృద్ధిని సాధించింది. పండుగ సీజన్ అమ్మకాల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఉత్పత్తులను నిల్వ చేసుకోవడం ద్వారా అధిక రవాణాను సాధించగలిగాయని ఐడీసీ ఇండియా రీసెర్చ్ డైరెక్టర్ నవ్‌కేందర్ సింగ్ చెప్పారు.

స్మార్ట్‌ఫోన్‌ల రవాణాలో అధికంగా షావోమీ 25 శాతం వాటాను దక్కించుకోగా, తర్వాత శాంసంగ్ 22.3 శాతం, వీవో 16.7 శాతం, రియల్‌మీ 14.7 శాతం, ఒప్పో 11.3 శాతంతో వృద్ధిని సాధించాయి. అలాగే ఈ త్రైమాసిక్మలో మొత్తం 25 లక్షల ఫీచర్ రవాణా అయ్యాయని, ఇది వార్షిక ప్రాతిపదికన 30 శాతం క్షీణత అని ఐడీసీ పేర్కొంది. మొత్తం మొబైల్‌ఫోన్ మార్కెట్లో ఫీచర్‌ఫోన్‌లు 31 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

Advertisement

Next Story