- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రతికూలతలోనే సేవల రంగం
దిశ, వెబ్‌డెస్క్: వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా కోలుకోకపోవడంతో జూన్ నెలలో సేవల రంగం తీవ్ర ఒత్తిడికి గురైందని, వ్యాపార అవసరాల క్షీణత, తక్కువ సిబ్బంది ఉండటం లాంటి కారణాలతో ఈ రంగంలోని సెంటిమెంట్ ప్రతికూలంగా ఉన్నట్టు ఐహెచ్ఎస్ మార్కిట్ నివేదిక శుక్రవారం తెలిపింది. కొన్ని సంస్థలలో ఔట్‌పుట్ లెవల్స్ బలహీనపడటంతో కొనుగోలు నిర్వాహకుల సూచిక(పీఎంఐ) 33.7 పాయింట్లకు పెరిగినప్పటికీ మే నెలతో పోలిస్తే 12.6 పాయింట్లు, ఏప్రిల్‌తో పోలిస్తే 5.4 పాయింట్లు మాత్రమే పెరిగిందని వెల్లడించింది. పీఎంఐ గణాంకాల ప్రకారం.. 50 పాయింట్ల ఎగువన నమోదైతే వృద్ధిగా అంతకంటే తక్కువైతే క్షీణతగా పరిగణిస్తారు. నివేదిక ప్రకారం, మే నుంచి ఉత్పత్తిలో పెద్దగా మార్పు లేదని 59 శాతం సంస్థలు నివేదించగా, కేవలం 4 శాతం మాత్రమే వృద్ధిని నమోదు చేశాయి. 37 శాతం సంస్థలు ప్రతికూలతను నమోదు చేశాయి. దేశంలో కరోనా కేసులు పెరగడంతో సంక్షోభం కొనసాగుతోందని, అందుకే జూన్‌లోనూ సేవల రంగం ఇబ్బందుల్లో ఉన్నట్టు ఐహెచ్ఎస్ మార్కిట్ ఆర్థిక నిపుణులు జో హెస్ పేర్కొన్నారు.