- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కనిష్టానికి కొనుగోలు నిర్వాహకుల సూచిక!
దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే అనేక రంగాలు కరోనా, లాక్‌డౌన్ ఆంక్షల దెబ్బకు కుదేలవగా, దేశవ్యాప్తంగా సేవా కార్యకలాపాలు భారీగా పడిపోయాయి. ఏప్రిల్ నెలలో కొనుగోలు నిర్వాహకుల సూచిక(పీఎమ్ఐ) 5.4 శాతానికి దిగజారింది. ఓ ప్రైవేట్ సర్వే వివరాల ప్రకారం..సేవల రంగం కార్యకలాపాలు దారుణంగా పడిపోయినట్లు పేర్కొంది. ఐహెచ్ఎస్ మార్కిట్ సంస్థ సర్వే వివరాల ప్రకారం మార్చి నెలలో కొనుగోలు నిర్వాహకుల సూచిక 49.3 శాతం ఉండగా, ఏప్రిల్ నెలకు 5.4 శాతానికి పడిపోయింది. ఇంతటి దారుణమైన పతనం 14 ఏళ్లలో ఇదే తొలిసారని సంస్థ నివేదికలో స్పష్టం చేసింది.
లాక్‌డౌన్ కఠినతరం చేయడంతో ఏప్రిల్‌లో వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ పరిణామాలతో భారత సేవల ఆర్థిక వ్యవస్థ నెలవారీగా అత్యంత కనిష్టానికి పడిపోయింది. కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు కేంద్రం లాక్‌డౌన్ కొనసాగించిందని, కఠిన లాక్‌డౌన్ వల్ల కొనుగోలు నిర్వాహకుల సూచి 40 పాయింట్లకు పైగా పడిపోయినట్టు ఐహెచ్ఎస్ మార్కిట్ సర్వీసెస్ ఆర్థికవేత్త జో హెస్ తెలిపారు.
ఏప్రిల్ 7 నుంచి 28వ తేదీ మధ్య కాలంలో డేటాను సేకరించినట్టు ఐహెచ్ఎస్ మార్కిట్ సంస్థ తెలిపింది. కేంద్రం లాక్‌డౌన్ దశల వారీగా పొడిగిస్తూ వస్తోంది. ప్రస్తుతం మూడో దశలో మే 17 వరకూ పొడిగిస్తూ..ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు కొన్ని సడలింపులను ఇచ్చింది. ఈ పర్ణామాలతో లక్షల మంది ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి. అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుంటే, కొన్ని కంపెనీలు ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు వర్క్ ఫోర్స్‌ను తగ్గించి, కొత్త నియామకాలు ఉండబోవని చెబుతున్నాయి.
అంతేకాకుండా..సేవల రంగంలో విదేశీ డిమాండ్ మొత్తంగా సున్నాకు దిగజారింది. సేవా కార్యకలాపాలు చరిత్రలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో పడిపోయింది. సేవల కార్యక్రమాలతో సహా మార్చిలో మిశ్రమ కొనుగోలు వినియోగదారుల సూచి 50.6 ఉండగా, ఏప్రిల్‌లో ఆల్‌టైమ్ కనిష్టం 7.2 కి కుప్పకూలింది. లాక్‌డౌన్ ఆంక్షలను క్రమంగా సడలిస్తూ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాల్సి అత్యవసర పరిస్థితి ఏర్పడింది.
Tags: Coronavirus Impact on Global Economy, ihs markit, PMI Services, Coronavirus , Covid-19