భారత వృద్ధిరేటును సవరించిన ఏడీబీ!

by Harish |
భారత వృద్ధిరేటును సవరించిన ఏడీబీ!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా రికవరీని సాధిస్తోందని ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ ఆర్థిక వృద్ధి ఇదివరకు అంచనా వేసిన 9 శాతం ప్రతికూలత నుంచి 8 శాతానికి మెరుగు పరుస్తున్నట్టు వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థాయికి చేరుకుంటోందని, ఈ నేపథ్యంలోనే రెండో త్రైమాసికానికి వృద్ధి 7.5 శాతం ప్రతికూలతతో వేగంగా రికవరీ సాధించగలిగిందని ఏషియన్ డెవలప్‌మెంట్ ఔట్‌లుక్ నివేదికలో పేర్కొంది.

2020-21 ఆర్థిక సంవత్సరం రెండో సగంలో జీడీపీ బహుశా గతేడాది స్థాయికి పునరుద్ధరించబడుతుందని ఆశిస్తున్నామని, ఈ అంచనాలతోనే వృద్దిని 8 శాతం ప్రతికూలానికి సవరించినట్టు ఏడీబీ తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి 8 శాతం సానుకూలంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ద్రవ్యోల్బణానికి సంబంధించి రాబోయే నెలల్లో మెరుగ్గా ఉండొచ్చని, 2021-22 ఆర్థిక సంవత్సారానికి ఆర్‌బీఐ లక్ష్యం 4 శాతానికి చేరుకోవచ్చని ఏడీబీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత ద్రవ్యోల్బణ రేటు 4.5 శాతం నుంచి 5.8 శాతానికి సవరిస్తున్నట్టు ఏడీబీ వెల్లడించింది.

Advertisement

Next Story