‘కొవిడ్-19 తీవ్రత ఉన్నప్పటికీ అభివృద్ధి సాధ్యం’

by Harish |   ( Updated:2020-08-02 05:59:09.0  )
‘కొవిడ్-19 తీవ్రత ఉన్నప్పటికీ అభివృద్ధి సాధ్యం’
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలతో పెట్టుబడిదారుల్లో పారదర్శకత నెలకొందని, దీంతో కరోనా తీవ్రత విపరీతంగా ఉన్న సమయంలోనూ దేశీయ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధిలోకి వెళ్తుందని గ్లోబల్ రియల్ ఎస్టేట్ పారదర్శకత సూచీ(జీఆర్ఈటీఐ) నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 వైరస్ విజృంభిస్తున్న క్రమంలో అన్ని రంగాలు డీలాపడ్డాయి. కానీ, రియల్ రంగం మాత్రం దూసుకెళ్తుందని నివేదిక అభిప్రాయపడింది.

దేశీయ రియల్ ఎస్టేట్ రంగం పారదర్శకత సూచీలో అంతర్జాతీయంగా 34వ స్థానాన్ని దక్కించుకుందని ఈ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా దేశీయ పారదర్శకత పెరిగేందుకు గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, గ్రీన్ రేటింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హాబిటాట్ అసెస్‌మెంట్ లాంటి సంస్థలు కీలకంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. ఈ నివేదికలో రియల్ ఎస్టేట్ రంగాన్నే కాకుండా మొత్తం 210 అంశాలలో పారదర్శకత, స్వయం సమృద్ధి వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నట్టు వెల్లడించింది.

‘గ్లోబల్ పారదర్శకత సూచీలో భారత్, ఏళ్లుగా స్థిరమైన అభివృద్ధిని కనబరిచింది. వాస్తవానికి ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం లాంటి దేశాలు సానుకూలమైన ప్రభుత్వ మద్దతు, మెరుగైన పర్యావరణ వ్యవస్థ కారణంగా అధిక పారదర్శకతను కలిగి ఉన్నాయని’ జేఎల్ఎల్ సీఈవో, ఇండియా హెడ్ రమేష్ నాయర్ తెలిపారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story