- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు వారాల్లో ఎగుమతులు 11 శాతం వృద్ధి!
దిశ, వెబ్‌డెస్క్: 2021 ఏడాది జనవరి 14తో ముగిసిన మొదటి 15 రోజుల్లో భారత ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 10.92 శాతం పెరిగి సుమారు రూ. 87.3 వేల కోట్లకు చేరుకున్నాయి. ఇందులో ముఖ్యంగా ఔషధ, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ రంగాల వృద్ధికి దారితీసింది. ఈ వృద్ధి కార్యకలాపాల పునరుజ్జీవనాన్ని సూచిస్తుంది. అదేవిధంగా జనవరిలో 1 నుంచి 14వ తేదీల మధ్య కాలంలో దిగుమతులు 6.58 శాతం పెరిగి సుమారు రూ. 1.33 లక్ష కోట్లకు చేరుకున్నాయి. ఈ పెరుగుదలకు ముఖ్యంగా బంగారం, ముత్యాలు, విలువైన రత్నాలు దోహదపడ్డాయి. సమీక్షించిన ఈ కాలంలో బంగారు దిగుమతుల విలువ సుమారు రూ. 3,345 కోట్లు పెరిగాయి. మూడు నెలల తర్వాత డిసెంబర్‌లో భారత ఎగుమతులు వృద్ధిని సాధించాయి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్, ఆహార ఉత్పత్తులు, ఔషధాలు ఎగుమతులు పుంజుకోవడంతో వృద్ధి నమోదైనట్టు తెలుస్తోంది. ఈ రెండు వారాల్లో పెట్రోలియం, చమురు మినహా ఎగుమతులు 16.07 శాతం పెరగ్గా, పెట్రోలియం మినహా దిగుమతులు 18.78 శాతం పెరిగాయి.