దేశ ఎగుమతులు డౌన్!

by Harish |
దేశ ఎగుమతులు డౌన్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో దేశ ఎగుమతులు 17.84 శాతం తగ్గాయి. అదేవిధంగా దిగుమతులు సైతం 33.56 క్షీణించాయని వాణిజ్య కార్యదర్శి అనుప్ వాధవన్ బుధవారం తెలిపారు. దీంతో వాణిజ్య లోటు కూడా తగ్గినట్లు ఆయన పేర్కొన్నారు. రత్నాలు, ఆభరణాలు, పెట్రోలియం మినహాయిస్తే క్షీణత తక్కువేనని, ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతున్న రంగాల్లో అదనంగా మరికొంత క్షీణత ఉందని బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో అనుప్ చెప్పారు. ఈ ఎనిమిది నెలల కాలలో ఎగుమతుల్లో ఫార్మా 15 శాతం, బియ్యం 39 శాతం, ఇనుప ఖనిజం 62 శాతం వాటాను కలిగి ఉన్నాయని చెప్పారు.

వాణిజ్య, పరిశ్రమ శాఖా మంత్రి పీయూష్ గోయెల్ మాట్లాడుతూ.. 2025 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే అవకాశముందని చెప్పారు. ‘ఆర్థికవ్యవస్థ చాలా వేగంగా కోలుకుంటోంది. పరిశ్రమ మరింత పారదర్శకంగా ఉందని, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలు భారత్ వైపు చూస్తున్నాయని పీయూష్ గోయెల్ వెల్లడించారు. దేశానికి ప్రయోజనాలు కలిగే నిర్దిష్ట రంగాలకు మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం పలు ప్రణాళికలను సిద్ధం చేస్తోందన్నారు. మొత్తం 24 రంగాలను గుర్తించాం. ఇవి భారత్‌లో రూ. 20 లక్షల కోట్ల వార్షిక ఉత్పత్తి తయారీకి దోహదపడతాయని నమ్ముతున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed