- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వినియోగదారుల వ్యయంపై ఫిచ్ సొల్యూషన్స్ నివేదిక
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాదిలో కొవిడ్-19 మహమ్మారి కారణంగా వినియోగదారుల వ్యయం సంకోచించిన నేపథ్యంలో గృహాల వ్యయం 2021లో తిరిగి వృద్ధిని సాధిస్తుందని, ఇది 6.6 శాతం వరకూ ఉండొచ్చని ఫిచ్ సొల్యూషన్స్ సోమవారం తెలిపింది. అలాగే, 2020లో వినియోగదారుల వ్యయం 12.6 శాతం ప్రతికూలంగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న సంకోచం కారణంగా 2021లో వృద్ధి సానుకూలంగా ఉన్నప్పటికీ, రికవరీ అయ్యే చాలా దేశాల కంటే నెమ్మదిగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు ఫిచ్ సొల్యూషన్స్ వెల్లడించింది. అంతేకాకుండా, కొవిడ్-19 ముందు స్థాయికి చేరుకునేందుకు సమయం పడుతుందని, 2021 రెండో సగంలోనే సాధ్యపడొచ్చని అభిప్రాయపడింది. ‘కరోనా మహమ్మారి వల్ల వినియోగదారుల వ్యయం భారీగా క్షీణించిందని, ఈ కారణంగా గృహ వ్యయం 2021లోనే తిరిగి వస్తుందని అంచనా వేస్తున్నట్టు పేర్కొంది. అలాగే, అన్ని ప్రధాన వినియోగదారుల ఖర్చులు 2021లోనే సానుకూల వృద్ధిని చూడగలవని తెలిపింది.