- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆధునిక సాంకేతికం వైపు ఇండియన్ రైల్వే
దిశ, కంటోన్మెంట్ : భారత రైల్వే ఆధునిక సాంకేతికత వైపు పరుగులు తీస్తోంది. సిబ్బంది సామర్థ్యం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పరిశోధనా రంగాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల నిర్వహణ కోసం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో భారతీయ రైల్వే అవగాహనా ఒప్పందాన్ని పునరుద్దరించడంతో పాటు డాటా విశ్లేషణ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయనుంది. దీంతో పాటు ఇంటిగ్రేటెడ్ కోల్ ఫ్రైట్ ఆప్టిమైజేషన్ మోడల్ వంటి అంశాలపై ఐఎస్‌బీతో రైల్వే శాఖ ఒప్పందం కురుర్చకుంది.
ఏడాది పాటు సిబ్బందికి శిక్షణ
కృత్రిమ మేధస్సు, డాటా విశ్లేషణ నిర్వహణ కోసం ఐఎస్‌బీతో ఇండియన్ రైల్వే 12 నెలలకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది. కంప్యూటింగ్, డాటా సెన్స్, భారీ డాటా విశ్లేషణపై రైల్వే సిబ్బందికి ఐఎస్‌బీ సుమారు ఏడాది పాటు శిక్షణ ఇవ్వనుంది. భవిష్యత్ అంచనాలకు అనుగుణంగా వివిధ సాంకేతిక అంశాలకు కృత్రిమ మేధస్సు ఉపయోగిస్తుంది. ఇండియన్ రైల్వే దత్తత తీసుకునే అంశాలను కృత్రిమ మేధస్సు, డాటా విశ్లేషణలో గుర్తిస్తారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా సమక్షంలో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ కె.శివప్రసాద్ కోల్ ఫ్రైట్ ఆప్టిమైజేషన్ మోడల్ నెట్‌వర్క్ అభివృద్ధి కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ జె.కె.జెయిన్ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, డాటా అనాలిటిక్స్‌పై, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ రాజీవ్ కిషోర్ సామర్థ్య వృద్ధి, పరిశోధన నిర్వహణ కోసం ఐఎస్‌బీ డిప్యూటీ డీన్ మిలింద్ సోహోనితో సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో బుధవారం ఒప్పందాలను ఖరారు చేశారు.
ఇంటిగ్రేటెడ్ బొగ్గు రవాణా ఆప్టిమైజేషన్ మోడల్
రైల్వే వ్యవస్థలో వనరుల లభ్యతకు అనుగుణంగా సరుకు రవాణా రైళ్ల వివరాలు అందించడం, దీంతో పాటు ఖాళీ రేక్‌లు తదితర సమాచారాన్ని వినియోగించుకుని సరుకు రవాణాను గరిష్ఠ స్థాయికి చేర్చడం ఇంటిగ్రేటెడ్ బొగ్గు రావాణా ఆప్టిమైజేషన్ మోడల్ ప్రధాన ఉద్దేశ్యం. ప్రధానంగా, బొగ్గు రవాణా ద్వారా రైల్వేకు 50 శాతం ఆదాయం సమకూరుతోంది.
ఈ అంశాల్లో శిక్షణ..
– రైల్వే అధికారులకు నాయకత్వం, వ్యూహాత్మకంగా నిర్వహణ, చర్చు, చేంజ్ మేనేజ్‌మెంట్‌పై ఐఎస్‌బీ శిక్షణ ఇస్తుంది.
– మౌలిక వసతుల, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, వినియోగదారులతో సంబంధాలు, నిర్వహణ, రెవెన్యూ మేనేజ్‌మెంట్, ఇన్నోవేషన్స్ మొదలగు రంగాలలో మేనేజ్‌మెంట్, చేంజ్ మేనేజ్‌మెంట్‌పై దక్షిణ మధ్య రైల్వే అధికారులకు వర్క్ షాపుల ద్వారా ట్రైనింగ్ ఇస్తారు.
– రైల్వే అభివృద్ధి కోసం బ్రాండ్ క్యాప్టిలైజేషన్, వినియోగదారుడు సంతృప్తి చెందడం, బిజినెస్ నిర్వహణ మొదలగు సున్నిత అంశాలపై రెండు సంస్థలు పరస్పరం సహకరించుకుంటాయి.
రైల్వే అబివృద్ధికి ఎంతో తోడ్పాటు: గజానన్ మాల్యా, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్
ఐఎస్‌బీతో జరిగిన ఈ ఒప్పందం సంస్థ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. సంస్థ మరింత సమర్థవంతంగా పనిచేయడానికి డాటా విశ్లేషణ, కృత్రిమ మేధస్సు రంగంలో ముందడుగు వేసే సమయం వచ్చింది. వినియోగదారుల అంచనాకు, సంస్థ లక్ష్యాలకు చేరువవడానికి ఐఎస్‌బీ నూతన సాంకేతిక శిక్షణ చాలా విలువైనది.
నూతన ఆలోచనాలకు నాంది: మిలింద్ సోహోనీ, ఐఎస్‌బీ డిప్యూటీ డీన్
భారతీయ రైల్వే, దక్షిణ మధ్య రైల్వేతో కలిసి పని చేయడం గొప్ప అనుభూతి. ఇండియన్ రైల్వేస్‌కి ఐఎస్‌బీ నూతన ఆలోచనను, సాంకేతికను అందిస్తుంది. ఎంఓయూతో రాబోవు మూడేండ్ల పాటు ఈ రెండు సంస్థలు పరిశోధన, సాంకేతిక అంశాలను ఇచ్చి పుచ్చుకుంటాయి.