'దేశీయ ఔషధ పరిశ్రమలో ప్రాథమిక సంస్కరణలు అవసరం'!

by Harish |
Indian pharma
X

దిశ, వెబ్‌డెస్క్: 2030 నాటికి భారత ఔషధ పరిశ్రమ సుమారు రూ.9 లక్షల కోట్ల లక్ష్యాన్ని అందుకునేందుకు ప్రాథమిక సంస్కరణలను చేపట్టాలని, కొత్త ఆవిష్కరణలు జరగాలని ఈవై-ఫిక్కీ సంయుక్త నివేదిక అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశీయ ఔషధ పరిశ్రమ సుమారు రూ.3 లక్షల కోట్లుగా ఉంది. ఈ క్రమంలో రూ. 9 లక్షల కోట్ల లక్ష్యాన్ని చేరుకోవాలంటే పరిశ్రమ గత దశాబ్దం నమోదైన వృద్ధి రేటు 6 శాతం నుంచి రెట్టింపు స్థాయిలో 12 శాతం సాధించాల్సి ఉంది. గత రెండు దశాబ్దాలుగా ఫార్మా పరిశ్రమ సుమారు 13 శాతం వార్షిక వృద్ధి రేటును సాధిస్తున్నప్పటికీ, గత దశాబ్దంలో ఇది 8.5 శాతం, గత ఐదేళ్లలో 6.2 శాతంతో తగ్గుతూ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లకు జనరిక్ మందులను సరఫరా చేయడం ద్వారా దేశీయ ఫార్మా పరిశ్రమ వృద్ధిని సాధించింది. 2020-2030 మధ్య దేశీయ పరిశ్రమ 12 శాతం సగటు వార్షిక వృద్ధి రేటు నమోదవ్వాలని ఈవై-ఫిక్కీ నివేదిక పేర్కొంది. ప్రపంచ వ్యాక్సిన్ డిమాండ్‌లో 60 శాతానికి పైగా తీర్చడంతో పాటు, అతిపెద్ద ఫార్మా మార్కెట్ అయిన యూఎస్‌కు 40 శాతం, యూకేకు 25 శాతం జరనిక్ ఔషధాలను సరఫరా చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed