విరాట్ అంటే గౌరవమే భయం కాదు : పాక్ బౌలర్

by  |
విరాట్ అంటే గౌరవమే భయం కాదు : పాక్ బౌలర్
X

దిశ, స్పోర్ట్స్: ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తారో ఆటగాళ్లు కూడా అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో ఉంటారని పాకిస్తాన్ యువ బౌలర్ నసీమ్‌ షా అంటున్నాడు. ఇండియాతో మ్యాచ్ ఆడాలని తనకు చాలా ఉత్సహంగా ఉందని ఈ పేసర్ వ్యాఖ్యానించాడు. భారత్, పాక్ మ్యాచ్‌లో ఆటగాళ్లు హీరోలవ్వొచ్చు, విలన్లు కూడా అవ్వొచ్చు. కానీ, అలాంటి మ్యాచ్‌లు ఎప్పుడో ఒకసారి జరుగుతాయి కాబ్టటి ఒక ఆటగాడిగా తనకు చాలా ప్రత్యేకం అన్నాడు. భారత్‌తో మ్యాచ్ ఆడాలని, ముఖ్యంగా కోహ్లికి బౌలింగ్ చేయాలని తనకు ఆసక్తిగా ఉన్నట్టు చెప్పాడు. కొహ్లీ అంటే గౌరవం ఉంది. కానీ. అతడికి బౌలింగ్ చేయడానికి తాను భయపడనని చెప్పాడు. ఇటీవల రావల్పిండిలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ నమోదు చేసిన నసీమ్ ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. 16 ఏండ్ల 359 రోజుల వయసులోనే అతను ఈ ఘనత సాధించాడు.



Next Story

Most Viewed