శ్రీలంక నావికా దళానికి ఇండియా సహాయం

by  |
శ్రీలంక నావికా దళానికి ఇండియా సహాయం
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంక నావికా దళానికి ఇండియన్ కోస్ట్‌గార్డ్(ఐసీజీ) సహాయపడింది. ఈ మేరకు ఐసీజీ శుక్రవారం ట్వీట్ ద్వారా వివరాలు తెలిసింది. శ్రీలంక తూర్పు తీరంలో 37 నాటికల్ మైళ్ళ దూరంలో శుక్రవారం ఉదయం ఎంటీ న్యూ డైమండ్ ఆయిల్ ట్యాంకర్‌లో పేలుడు సంభవించడంతో, అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటలు ఆర్పడంతో పాటు, 23 మంది సిబ్బందిని, ఇరు దేశాల నావికా దళ సిబ్బంది కాపాడారు. ప్రమాదంలో చిక్కుకున్న ఫిలిపినో (నౌక సిబ్బంది) కోసం గాలిస్తున్నారు.

ఈ మంటలను ఆర్పడంలో ఐసీజీ నౌక శౌర్య, శ్రీలంక నావికా దళం విజయం సాధించాయి. అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న ‘ఎంటీ న్యూ డైమండ్’ ఆయిల్ ట్యాంకర్ నౌక నుంచి సిబ్బందిని కాపాడటంలో శ్రీలంక నావికా దళానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) సహాయపడినట్టు ట్విట్టర్‌లో పేర్కొంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌకలు, శ్రీలంక నావికా దళం, భారతదేశం పంపించిన రెండు ఎమర్జెన్సీ టోయింగ్ వెహికల్స్ గాలింపు, సహాయక చర్యలను నిర్వహించాయి. శ్రీలంక నావికా దళం కోరిన మీదట తక్షణమే ఐసీజీ నౌక శౌర్యను, డోర్నియర్ విమానాన్ని ప్రమాదంలో చిక్కుకున్న ఆయిల్ ట్యాంకర్ ఎంటీ న్యూ డైమండ్‌ను కాపాడేందుకు పంపించినట్టు తెలిపింది.


Next Story

Most Viewed