- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సాత్నం సింగ్‌కు ‘నాడా’ షాక్
by Shyam |

X
న్యూఢిల్లీ: బాస్కెట్ బాల్ ప్లేయర్ సాత్నం సింగ్‌కు నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ(నాడా) షాక్ ఇచ్చింది. డోపింగ్‌కు పాల్పడ్డట్టు తేలడంతో నాడా అతనిపై రెండేళ్లపాటు నిషేధం విధించింది. ఈ విషయాన్ని నాడా తన ట్విట్టర్ ఖాతాలో బుధవారం వెల్లడించింది. తాము జరిపిన హిగెనామైన్ బీటా-2-అగోనిస్ట్ అనే పరీక్షలో సాత్నం సింగ్‌కు పాజిటివ్‌గా తేలినట్టు వెల్లడించింది. దీంతో యాంటీ డోపింగ్ డిసిప్లీనరీ ప్యానల్ రెండేళ్లపాటు నిషేధం విధించినట్టు పేర్కొంది. కాగా, పంజాబ్‌కు చెందిన సాత్నం ఉత్తర అమెరికాలోని నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్(ఎన్బీఏ) నిర్వహించే సమ్మర్ లీగ్‌లో డల్లాస్ మేవ్‌రిక్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. భారత్ నుంచి ఎన్బీఏలో ఆడిన తొలి ఆటగాడు సాత్నం సింగే కావడం గమనార్హం.
Next Story