ఇండియన్ బ్యాంక్ నికర లాభం రూ. 369 కోట్లు!

by Harish |
ఇండియన్ బ్యాంక్ నికర లాభం రూ. 369 కోట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ యాజమాన్య ఇండియన్ బ్యాంక్ (Indian Bank) 2020-21 ఆర్థిక సంవత్సరాని (Financial year)కి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం (Net profit) స్వల్పంగా 1 శాతం పెరిగి రూ. 369.26 కోట్లుగా నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం (Bank net profit) రూ. 365.37 కోట్లుగా ఉంది. అయితే, ప్రస్తుత ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు రూ. 217.73 కోట్ల నికర నష్టాల (Net losses)ను నమోదు చేసింది.

సమీక్షించిన త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం (Income) దాదాపుగా రెట్టింపు అయ్యి రూ. 11,446.71 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం (Financial year) ఇదే త్రైమాసికంలో బ్యాంక్ ఆదాయం రూ. 5,832.12 కోట్లుగా ఉన్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌ (Regulatory Filing)లో పేర్కొంది.

ఇక, జూన్ 30 నాటికి స్థూల నిరర్ధక ఆస్తులు (non-performing assets) 10.90 శాతానికి పెరగడంతో బ్యాంకు ఆస్తుల నాణ్యత మరింత దిగజారింది. గతేడాది ఇదే కాలంలో బ్యాంకు ఎన్‌పీఏ (non-performing assets)లు 7.33 శాతంగా ఉంది. నికర ఎన్‌పీఏ (NPA)లు 3.76 శాతానికి తగ్గాయని బ్యాంకు వెల్లడించింది. జూన్ త్రైమాసికంలో ఇండియా బ్యాంకు బ్యాడ్ లోన్స్ (India Bank Bad Loans), కరోనా లాంటి అనూహ్య పరిస్థితుల కోసం కేటాయింపులు రూ. 794.82 కోట్ల నుంచి రూ. 2,139.12 కోట్లకు పెరిగాయని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed