ఇండియన్ ఆర్మీలో భారీ మార్పు.. జనవరి 15న కీలక ప్రకటన.!

by Shamantha N |   ( Updated:2021-12-02 00:45:55.0  )
Indian Army
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఆర్మీలో మరో మార్పు రానుంది. ఇందుకోసం ఆర్మీ సర్వత్రా సిద్దమవుతోంది. దేశ రక్షణలో భాగంగా ప్రతి జవాను తన పూర్తి ప్రతిభను కనబరచాలని అధికారులు భావించారు. కానీ జవాన్ల యూనిఫాం బరువు కారణంగా వారు తమ పూర్తి నైపుణ్యంతో పనిచేయలేకపోతున్నారని వారు అభిప్రాయపడ్డారు. అందుకోసమని జవాన్ల కోసం సరికొత్త యూనిఫాంను డిజైన్ చేశారు. ఈ కొత్త యూనిఫాం పాత యూనిఫాం కంటే తేలికగా ఉండటమే కాకుండా, వాతావరణ మార్పులు జరిగినప్పుడు కంఫర్ట్‌గా ఉంటుంది. అయితే దీనిని జనవరి 15న ఆర్మీ డే పరేడ్ సందర్భంగా తొలి సారి ప్రదర్శించనున్నారు.

ఈ కొత్త యూనిఫాం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్‌టీ) ద్వారా అనుమతి పొందింది. అయితే ఇతర దేశాల యూనిఫాంలా ఈ కొత్త యూనిఫాం కూడా టక్ చేయబడదని, కానీ నాణ్యత కోసం ఆర్మీ బ్యాడ్జెస్, స్టార్స్, అకౌట్‌మెంట్‌లకు తక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారా అన్నది ఇంకా అస్పష్టంగా ఉందని ఓ అధికారి అన్నారు.

Advertisement

Next Story

Most Viewed