- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియన్ ఆర్మీ ముందుకు.. చైనా వెనక్కి
దిశ, వెబ్‌డెస్క్: భారత్-చైనా సరిహద్దుల్లో ఇటీవల ఇరు దేశాల సైనికుల మోహరింపులు కలవరపెట్టిన సంగతి తెలిసిందే. అయినా, పూర్తి స్థాయిలో చైనా బలగాలు వెనక్కితగ్గకుండా రెచ్చిపోయాయి. తాజాగా, తూర్పు లఢక్‌లో 35 వేల మంది భారత్‌కు చెందిన ప్రత్యేక సైనిక వర్గాలు మోహరించాయి. అటు, చైనా బలగాలు మాత్రం 50 మంది మాత్రమే ఉండి.. మిగతావారు తమ ప్రధాన శిబిరాలకు ప్రయాణమవడం గమనార్హం.
త్వరలో శీతాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. అత్యంత కఠినమైన సియాచిన్, లఢక్ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే సైనికులకు ప్రత్యేక శిక్షణ అనంతరమే రంగంలోకి దించుతారు. అయితే, ఆ సామర్థ్యం కేవలం భారత సైనికులకే ఉందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అందుకే, 35 వేల మంది ప్రత్యేక దళాలు రంగంలోకి దించామని వెల్లడించారు. కానీ, అంత సామర్థ్యం చైనా బలగాలకు లేదని.. అందుకే వారు తమ శాశ్వత శిబిరాలకు మళ్లినట్టు అధికారులు స్పష్టం చేశారు.