- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రెండో భాగంలో భారత్ వృద్ధి సాధిస్తుంది: మూడీస్ !
దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ భారత ఆర్థిక వ్యవస్థ 6.9 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం ఏడాది కొవిడ్-19 సంక్షోభం కారణంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ప్రతికూల సంకేతాలు వస్తున్న నేపథ్యంలో రేటింగ్ ఏజేన్సీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడుతుందని అంచనా వేసింది. ప్రస్తుత ఏడాదికి భారత జీడీపీ 3.1 శాతం అంచనాను కొనసాగిస్తున్నట్టు మూడీస్ తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాల కంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు మూడీస్ తెలిపింది. జీ20 దేశాల్లో భారత్, చైనా, ఇండోనేషియాలు మాత్రమే వాస్తవ జీడీపీని బలంగా నమోదు చేస్తాయని మూడీస్ ‘గ్లోబల్ మాక్రో ఔట్‌లుక్ 2020-21’ ఆగస్టు నివేదికలో తెలిపింది. 2020 రెండో భాగంలో వాస్తవ జీడీపీ తిరిగి గాడిన పడుతుందని, 2021లో ఆర్థిక వ్యవస్థ కరోనాకు ముందునాటి స్థాయికి చేరుకుంటుందని వెల్లడించింది. కరోనాకు ముందే భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నట్టు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి బాగోలేదని, 4.2 శాతం మాత్రమే వృద్ధి నమోదు చేసినట్టు పేర్కొంది. ఇది గత 11 ఏళ్లలో ఇది అతి తక్కువ వృద్ధి అని వెల్లడించింది.